Surprise Me!

RK Nagar By Poll : This Actor Also Will Contest | Oneindia Telugu

2017-12-01 1,603 Dailymotion

Film actor vishal may contest in RK Nagar by poll. <br /> <br />తమిళనాడు రాష్ట్రంలోని ఆర్‌కె నగర్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో సినీ నటుడు విశాల్ పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతితో ఆర్‌కె నగర్ అసెంబ్లీకి ఉప ఎన్నిక అనివార్యమైంది. గతంలోనే ఈ స్థానానికి ఉప ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. అయితే ఆ సమయంలో విచ్చలవిడిగా డబ్బులను ఖర్చు చేశారని ఆరోపణలు రావడంతో ఎన్నికలను వాయిదా వేశారు.ప్రస్తుతం ఈ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఆర్‌కె నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక విషయమై ముగ్గురు అభ్యర్థులు ఇప్పటికే రంగంలోకి దిగారు. డిఎంకె, అన్నాడిఎంకె అభ్యర్థులతో పాటు, శశికళ వర్గానికి చెందిన దినకరన్ కూడ ఈ స్థానం నుండి ఎన్నికల బరిలోకి దిగారు. <br />తమిళనాడు సినీ నటుడు విశాల్ కొత్త పార్టీని కూడ పెట్టే అవకాశాలు కూడ ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. 2021 ఎన్నికల్లో మొత్తం 234 స్థానాల్లో పోటీ చేసేందుకు విశాల్ పార్టీని ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అయితే ఈ విషయాలపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఇప్పటికే రజనీకాంత్, కమల్‌హసన్ ‌ కూడ కొత్త పార్టీలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ తరుణంలో విశాల్ పార్టీ ఏర్పాటు చేసే అంశం తెరమీదికి రావడం సంచలనం రేపుతోంది.

Buy Now on CodeCanyon